మార్కాపురంలో సచివాలయ ఉద్యోగుల నిరసన
NEWS Jun 23,2025 06:38 pm
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను సొంత మండలాలు, మున్సిపాలిటీల్లోనే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ మార్కాపురంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సొంత ప్రాంతాల్లో ఉద్యోగం చేసే హక్కు అందరికీ ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.