ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తు జరగాలి
NEWS Jun 23,2025 12:59 pm
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్ కామెంట్స్ చేశారు ఎంపీ డీకే అరుణ. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయంటూ బీజేపీ నేతలు, ప్రజా ప్రతినిధులు చెప్పినా పట్టించు కోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కువగా చేశారంటూ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.