జైలుకు వెళ్లినోళ్లు ఒక్కటైతే తట్టుకోవడం కష్టం
NEWS Jun 23,2025 12:44 pm
మాజీ మంత్రి అంబటి రాంబాబు లోకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి చంద్రబాబును 53 రోజులు పెట్టారనే కక్షతో కావాలని కక్ష సాధింపులకు దిగడం, కేసులు నమోదు చేయడం, జైలుకు పంపించడం జరుగుతోందని ఆరోపించారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా ఒక్కటైతే తట్టుకోవడం కష్టమన్నారు. మీరు ఎంతగా వేధింపులకు పాల్పడినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. ఎన్నాళ్లు జైలులో పెడతారో చూస్తాం, అన్నింటికీ మేం సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు.