లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి కొడుక్కి నోటీసులు
NEWS Jun 23,2025 11:42 am
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి షాక్ తగిలింది. సిట్ తనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తండ్రి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా కొడుకు మోహిత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ దావాపై రేపు ఏసీబీ కోర్టు విచారణ జరుపుతుంది.