ఏపీఎండీసీ బాండ్లు జారీ చట్ట విరుద్దం
NEWS Jun 22,2025 09:41 pm
ఏపీఎండీసీ బాండ్లు జారీ చేయడంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా చట్ట విరుద్దమన్నారు. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఆరోపించారు. రూల్స్ పాటించకుండా తిరిగి రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. రూ. 1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారంటూ ట్వీట్ చేశారు.