తండ్రీ కొడుకులకు జైలు ఖాయం - టీపీసీసీ
NEWS Jun 22,2025 03:37 pm
తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ లది నీచమైన చరిత్ర అంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమన్నారు. వారి చొరవతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమన్నారు. ట్యాప్ చేసిన 650 ఫోన్లను బహిర్గతం చేయాలన్నారు. ఇందులో ఎవరెవరివి ఉన్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.