బీసీల రిజర్వేషన్ల కోసం సర్కార్ పై యుద్దం
NEWS Jun 22,2025 01:45 pm
కాంగ్రెస్ సర్కార్ పై యుద్దం ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. లేకపోతే ప్రజా, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన బాట పడతామని వార్నింగ్ ఇచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలన్నారు. బీసీలు ఇప్పుడు పోరాడక పోతే ఇంకెప్పుడు పోరాడుతారంటూ ప్రశ్నించారు. అందుకే తాను బీసీ నేత ఆర్. కృష్ణయ్య మద్దతు కోరేందుకు వచ్చానని చెప్పారు.