మెట్రో రెండో దశ నిర్మాణం కోసం నివేదిక సిద్దం
NEWS Jun 22,2025 01:27 pm
మెట్రో రైలు రెండవ దశ (బి) నిర్మాణం త్వరలోనే రూపు దిద్దుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిపాదనలను సిద్దం చేశామన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయని పేర్కొన్నారు. రూ. 7168 కోట్లతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి భారత్ ఫ్యూచర్ సిటీ దాకా, రూ. 6,946 కోట్లతో జేబీఎస్ నుండి మేడ్చల్ దాకా, రూ. 5,465 కోట్లతో జేబీఎస్ నుండి శామీర్ పేట దాకా నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.