ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడికి దిగింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచి పోయింది బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం.హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం యుద్దం కారణంగా అనుమతి లేదంటూ సిబ్బంది నిలిపి వేశారు. రెండు గంటలుగా టేకాఫ్ తీసుకోకుండా రన్ వే పైనే ఉండి పోయింది. విమానం టేకాఫ్ కాక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.