కేసీఆర్ ఫ్యామిలీ ఇక జైలుకే - బండి
NEWS Jun 22,2025 07:15 am
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులపై సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, ఇక వాళ్లు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని గతంలో రాహుల్ గాంధీ ఆరోపించారన్నారు. ఇంత జరుగుతున్నా వారిపై ఎందుకు సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేబినెట్, సబ్ కమిటీ నివేదికలను ఎందుకు బయట పెట్టడం లేదన్నారు.