కావాలని టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా..
NEWS Jun 22,2025 07:25 am
ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కావాలని ఐటీ రంగాన్ని ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, వాటి ఫలితంగా దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. 1995లో సాంకేతిక విప్లవం వచ్చిందని, ఇది తనను మరింత ఈ రంగంపై ఫోకస్ పెట్టేలా చేసిందన్నారు. ఆనాటి నుంచి నేటి దాకా తాను ఐటీని విడువ లేదన్నారు. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఈ సెక్టార్ పైనే ఆధారపడి ఉందన్నారు.