యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
NEWS Jun 21,2025 12:25 pm
యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్ రావు, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో యోగా గురూజీ డా.రాజ రత్నాకర్ పలు యోగాసనాలు వేయించడంతో పాటు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రాజశేఖర్, ట్రెజరరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ రాందాస్, అసిస్టెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్, న్యాయవాదులు యోగా డేలో పాల్గొన్నారు.