రకుల్ కు ఫిట్ నెస్ కపుల్ అవార్డ్
NEWS Jun 21,2025 11:24 am
11వ యోగా డే దినోత్సవం సందర్బంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ కు అవార్డు దక్కింది. తమ జంటకు ఫిట్ ఇండియా కపుల్ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని స్వయంగా నటి వెల్లడించారు. యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటిని ఆచరిస్తే అద్భుతాలు స్వంతం చేసుకోవచ్చని చెప్పారు. యోగా సాధన చేయడం వల్ల కీలక మార్పులు కలుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.