కె.జగన్నాధపురంలో ఘనంగా యోగా దినోత్సవం
NEWS Jun 21,2025 11:21 am
అయినవిల్లి (మం) కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.సూర్య కుమారి ఆధ్వర్యంలో విద్యార్థుల చేత పలు యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేయించారు. అనంతరం వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.