యోగాంధ్ర గిన్నిస్ రికార్డు
NEWS Jun 21,2025 09:47 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొన్న విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. మూడు లక్షల మందికిపైగా ప్రధాని మోదీతో కలిసి యోగా చేశారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారాలోకేశ్ సహా మంత్రులు,కేంద్ర మంత్రులు,అధికారులు అంతా పాల్గొన్నారు. విశాఖ నుంచి బోగాపురం వరకూ ఏర్పాటు చేసిన వేదిక నూతన చరిత్రకు నాంది పలికింది. ఇదిలా ఉండగా గతంలో సూరత్‌లో నమోదైన యోగా కార్యక్రమం రికార్డు బ్రేక్ అయింది.