వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం భాగం కావాలి
NEWS Jun 21,2025 08:10 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీపై. విశాఖపట్నంలో 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగాను విశ్వ వ్యాప్తం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారంటూ పీఎంకు కితాబు ఇచ్చారు. ఆయనను దార్శనికుడంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా భారతీయ సనాతన ధర్మం విశిష్టతను యావత్ ప్రపంచానికి తెలియ చేసిన గొప్ప వ్యక్తి మన పీఎం అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గౌరవమన్నారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలన్నారు.