యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది - మోదీ
NEWS Jun 21,2025 07:43 am
అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని అన్నారు ప్రధాని మోదీ. యోగా డే సందర్బంగా విశాఖ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని యోగా మార్చేసిందన్నారు. యోగా విశ్వవ్యాప్తం కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఇవాళ మనం ప్రవేశ పెట్టిన యోగాను 175 దేశాలు అనుసరిస్తున్నాయని, ఇదంతా భారత్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. మొత్తంగా యోగా యావత్ ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు.