మా వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు
NEWS Jun 20,2025 04:06 pm
సినిమా హీరోల ఫోన్లు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీలో పని చేసే మా వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అంశంపై CBI ఎంక్వయిరీకి డిమాండ్ చేశాడన్నారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నారు.