అవినీతి అధికారిని విధుల్లోకి ఎలా అనుమతిస్తాం?
NEWS Jun 20,2025 10:26 am
అవినీతి కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రభుత్వ అధికారి, ఆ కేసు నుంచి పూర్తిగా నిర్దోషిగా బయటపడే వరకు తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి అవినీతి అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం వల్ల ప్రజా విశ్వాసం దెబ్బతింటుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. లంచం తీసుకున్న కేసులో దోషిగా తేలిన ఒక రైల్వే ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.