వృధా పోయే నీటినే వాడుకుంటాం - సీఎం
NEWS Jun 20,2025 08:13 am
బనకచర్ల ప్రాజెక్టుపై రాద్దాంతం చేయడం ఎందుకని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తే ఎలా అని అన్నారు. తాము మిగిలి పోయిన నీళ్లనే వాడుకుంటామని చెప్పామన్నారు. తనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివన్నారు. తాను ఏనాడూ తెలంగాణతో వైరం పెంచు కోలేదన్నారు. కూర్చుని మాట్లాకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, ఇరు రాష్ట్రాలు వాడుకోవచ్చని అన్నారు.