ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత నాయక్
NEWS Jun 15,2025 04:42 am
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరింది సరిత. ఆమె స్వస్థలం భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండా. డ్యూటీలో భాగంగా తొలిరోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపింది సక్సెస్ ఫుల్ గా. గతంలో తను ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వహించింది. డ్రైవర్ గా విధుల్లో చేరిన సరితను ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.