శుభ ముహూర్తాల సందడి షురూ
NEWS Feb 18,2026 10:47 am
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు, జూన్‌లో 21-29 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మౌఢ్యమి కారణంగా గత ఏడాది నవంబర్ నుంచి శుభకార్యాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మౌఢ్యమి ముగిసినా తిథి, నక్షత్రం, దోషాలు, జాతకం వంటివి చూసుకొని శుభకార్యాలు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.