గద్దరన్న అంటేనే చైతన్యం..విప్లవం
NEWS Jun 15,2025 09:28 am
ప్రజా గాయకుడు గద్దరన్న అంటేనే చైతన్యం, విప్లవం గుర్తుకు వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో ఫిలిం అవార్డులను అందజేసింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడారు. గద్దర్ వ్యక్తి కాదు శక్తి అని అన్నారు. ఆయన స్పూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. జయ జయహే అందించిన అందెశ్రీ, జైబోలో తెలంగాణ అంటూ నినదించిన గద్దరన్న మా అందరికి స్పూర్తి అని పేర్కొన్నారు. గద్దర్ ఫిలిం అవార్డులు పొందిన వారంతా తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.