ఏపీ దేవాదాయ శాఖలో భారీ ప్రక్షాళన
NEWS Jun 15,2025 09:20 am
ఏపీ దేవాదాయ శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు కమిషనర్ రామచంద్ర మోహన్. అన్ని ప్రముఖ దేవాలయాల్లో 22 దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించారు.సింహా చలం దేవస్థానం, కనక మహాలక్ష్మి అమ్మ వారి ఆలయం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, తలుపులమ్మ దేవస్థానం, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక అధికారులను నియమించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి అదనపు కమిషనర్ ను నియమించారు.