విశాఖ పీఎం టూర్ షెడ్యూల్ ఖరారు
NEWS Jun 15,2025 09:08 am
ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈనెల 20న ఆయన నేరుగా భువనేశ్వర్ కు చేరుకుంటారు. అక్కడ పలు ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం నేరుగా జూన్ 20న విశాఖపట్నంకు చేరుకుంటారు. రాత్రి తూర్పు నౌకాదళ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్బంగా నగరంలో 5 లక్షల మందితో నిర్వహించే యోగా డే ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి పయనమవుతారు.