ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ గా సౌతాఫ్రికా
NEWS Jun 14,2025 06:20 pm
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా అవతరించింది దక్షిణాఫ్రికా. ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇచ్చింది. 27 ఏళ్ల తర్వాత తన కలను సాకారం చేసుకుంది. లార్డ్స్ మైదానంలో వేలాది మంది సాక్షిగా జరిగిన కీలక ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆసిస్ ను ఓడించింది. విజేతగా అవతరించింది. ఆసిస్ నిర్దేశించిన 282 రన్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఎడెన్ మార్క్రమ్ అద్భుతంగా ఆడాడు. 136 రన్స్ తో దుమ్ము రేపాడు. కెప్టెన్ బవుమా 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ 21 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు జట్టును విజయ తీరాలకు చేర్చాడు.