నీట్ యుజీ 2025 ఫలితాలు విడుదల
NEWS Jun 14,2025 03:20 pm
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2025 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది, రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ జనరల్ కేటగిరీలో 99.9999547 అద్భుతమైన పర్సంటైల్ స్కోర్‌తో ఆల్ ఇండియా ర్యాంక్ 1 గా నిలిచాడు. ఉత్కర్ష్ అవధియా, కృస్ణన్ జోషి, మృణాల్ కిషోర్, అవికా అగర్వాల్ , జెనిల్ వినోద్భాయ్ భయానీ, కేశవ్ మిట్టల్, ఝా భవ్య చిరాగ్, హర్ష్ కేదావత్, అరవ్ అగర్వాల్ వరుసగా 2 నుంచి 10వ ర్యాంకులు సాధించారు. వివిధ వర్గాలకు కటాఫ్ స్కోర్‌లకు స్పష్టత తెచ్చే కేటగిరీ వారీగా కట్-ఆఫ్‌లను కూడా NTA వెల్లడించింది.