రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి అభయం
NEWS Jun 14,2025 02:58 pm
తిరుపతిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం 09.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు రథోత్సవంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. 7 నుంచి 8.30 గం.ల మధ్య పుణ్యా హవచనం, నవగ్రహ పూజ చేపట్టారు. తదుపరి 8.41 - 8.55 గం.ల మధ్య రథారోహణం, 8.55- 8.58 గం.ల మధ్య రథాగమనం నిర్వహించారు. 09.00 - 10.30 గం.లకు భక్త జనసమోహం మధ్య రథోత్సవం చేపట్టారు. సా. 5.30 - 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రి 07.00 - 08.00 గం.ల మధ్య అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించారు.