కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు
NEWS Jun 14,2025 02:35 pm
సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికి రాదన్నారు. దానిని రద్దు చేయాలని, దాని వల్ల ఉపయోగం లేదన్నారు.KCR తన రక్తపు బొట్టు కరిగించి, మెదడు కరిగించి కట్టానంటూ ఆనాడు చెప్పారని, ఇప్పుడేమో అధికారులు కట్టారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నారు. ఇప్పుడేమో మాట మారుస్తున్నారని మండిపడ్డారు.