జేఎల్ఎం విద్యుత్ షాక్ తో మృతి
NEWS Jun 14,2025 12:56 pm
మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో జేఎల్ఎంగా విధులు నిర్వహిస్తున్న దుంపేట రాజేశం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఉదయం తన పనిలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లే విద్యుత్ లైన్ ని ఆఫ్ చేసి విద్యుత్ స్తంభంపై 11 కెవిపై తన పని నిర్వర్తిస్తుండగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ లైన్ ను ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి నిజనిజాలు, పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.