సినిమా అవార్డుల్లో సిరిసిల్ల జిల్లా ప్రతిభ
NEWS Jun 14,2025 12:01 pm
గద్దర్ సినిమా అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిభ పరిమళించింది. 'మల్లేశం' (2019) చిత్రానికి రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాల టీచర్, రచయిత పెద్దింటి అశోక్ కుమార్ మాటలు, టైటిల్ పాట అందించగా, ఉత్తమ తృతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. 2023లో 'బలగం' చిత్రానికి వేణు వెల్దండి దర్శకత్వం వహించి ఉత్తమ ప్రథమ చిత్రంగా నిలిచింది. ఈ ఇద్దరు సృజనాత్మక వ్యక్తులు జిల్లాకు గౌరవం తెచ్చారు.