మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు
NEWS Jun 14,2025 06:31 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ చీఫ్ ప్రభాకర్ రావు . ఎలాంటి ప్రశ్నలు వేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నిన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని అధికారులకు చెప్పాడు ప్రణీత్ రావు . తను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇవాళ విచారణ చేపట్టారు ప్రభాకర్ రావును. కాగా ఈ విచారణ అత్యంత కీలకంగా మారనుంది.