17 లక్షల మంది తల్లులకు రూ. 10 వేల కోట్లు
NEWS Jun 14,2025 10:29 am
ఏపీలో తల్లికి వందనం పథకం కింద 17 లక్షల మందికి పైగా తల్లులకు రూ. 10 వేల కోట్లకు పైగా వారి ఖాతాల్లో ఒకే రోజు నిధులను జమ చేయడం జరిగిందన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళుతోందన్నారు. గత జగన్ రెడ్డి ప్రజలను అన్ని రంగాలలో మోసం చేశారని ఆరోపించారు. అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా మాజీ సీఎం మారాలని హితవు పలికారు.