హక్కుల, మహిళా కమిషన్ కు రజని ఫిర్యాదు
NEWS Jun 14,2025 10:06 am
తనపై ABN ఛానల్, సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్‌పై మాజీ మంత్రి విడదల రజిని మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అత్యంత దారుణంగా దూషణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ వాపోయారు. తనతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి రోజాను సభ్య సమాజం సిగ్గుపడేలా కామెంట్స్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న సదరు ఛానల్, ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.