వైసీపీకి మంత్రి లోకేష్ వార్నింగ్
NEWS Jun 14,2025 09:57 am
వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. 24 గంటలు టైమ్ ఇస్తున్నానని అన్నారు. తల్లికి వందనం పథకంలో రూ. 2 వేలు చొప్పున తన ఖాతాల్లోకి వెళ్లాయంటూ వైసీపీ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. చేసిన ఈ ఆరోపణలను నిరూపించాలని , లేకపోతే తప్పు ఒప్పుకోవాలని అన్నారు. కాదంటే తాను కోర్టుకు వెళతానని వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు.