చంద్రప్రభ వాహనంపై శ్రీ వేంకటేశ్వరుడు
NEWS Jun 14,2025 09:16 am
తిరుపతిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనంపై వెన్న చిన్ని కృష్ణుడు అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఊంజల్ సేవ నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఘనంగా రథోత్సవం చేపట్టారు. టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం.