తెలంగాణలో కొత్తగా 571 స్కూల్స్ - సీఎం
NEWS Jun 14,2025 08:24 am
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గాను కొత్తగా 571 స్కూల్స్ ను ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. తాము వచ్చాక సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విద్యా శాఖపై సీఎం సమీక్ష చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ స్కూల్ ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మారుస్తున్నట్లు తెలిపారు.