యోగా డే కోసం 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్
NEWS Jun 14,2025 08:07 am
ఏపీ ప్రభుత్వం ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా యోగా డేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్టణంలో పెద్ద ఎత్తున యోగా ర్యాలీ. నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. 5 లక్షల మంది పాల్గొంటారని వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఒకే రోజు యోగా డేలో పాల్గొనేందుకు 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు యోగా కార్యక్రమంలో పాల్గొంటే సర్టిఫికెట్ ఇస్తామన్నారు.