త్వరలో అన్నదాత సుఖీభవ - సీఎం
NEWS Jun 14,2025 07:51 am
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి తప్పకుండా ప్రయారిటీ ఉంటుందన్నారు. ఈనెల 23 నుంచి ఇంటింటికీ తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, దీని ద్వారా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియ చేయాలని స్పష్టం చేశారు. జూలై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామన్నారు.