ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్
NEWS Jun 14,2025 07:50 am
ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం నెలకొందని, దీని కారణంగా కర్ణాటక, తెలంగాణతో పాటు ఏపీలో కూడా మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి ఇప్పుడు పశ్చిమ-మధ్య అరేబియా సముద్రం నుండి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతుందని తెలిపింది. చేపలు పట్టే జాలర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్లు, శిథిల భవనాల వద్ద ఉండ వద్దని సూచించింది.