రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి
NEWS Jun 13,2025 04:27 pm
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నవాడైన రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్ పై అవగాహన లేదన్నారు. విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనదని పేర్కొన్నారు. అనుభవం లేని రామ్మోహన్ నాయుడు ఆ శాఖకు పనికిరాడని అన్నారు. అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఇండియా ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తక్షణమే రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు.