ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
NEWS Jun 13,2025 03:08 pm
ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పైలట్ అత్యవసరంగా థాయ్‌లాండ్‌లో విమానం ల్యాండింగ్ చేశారు. థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఇది చోటు చేసుకుంది. విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. అండమాన్ నికోబార్‌లో కాసేపు చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ అయ్యాక ఫ్లైట్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.