జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీం బిగ్ రిలీఫ్
NEWS Jun 13,2025 03:05 pm
అమరావతి మహిళా రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా మంగళగిరి కోర్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ మనోడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కొమ్మినేనికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది హైకోర్టును.