కార్పొరేట్ స్థాయిలో వంగూరు పబ్లిక్ స్కూల్
NEWS Jun 13,2025 02:16 pm
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చుతున్నట్లు వెల్లడించారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.