టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
NEWS Jun 13,2025 10:55 am
నాయుడుపేటకు చెందిన పోతిరెడ్డి లోకేష్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. దాత తరఫున ఆయన ప్రతినిధి రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా విరాళం డీడీని అందజేశారు.