గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి
NEWS Jun 13,2025 09:29 am
తిరుపతి లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి 07.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి గజ వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు.