తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్
NEWS Jun 13,2025 08:50 am
వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం చేసుకుందని తెలిపింది. దీని కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు పడతాయని,గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.