కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు
NEWS Jun 12,2025 09:58 am
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అందినంత మేర దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం రూపశిల్పిగా చెప్పుకున్న మహానుభావుడు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాక తప్పలేదన్నారు. అభివృద్ధి ముసుగులో కాళేశ్వరం వంకతో ఎవరూ ఊహించని రీతిలో కోట్లు కొల్లగొట్టారంటూ మండిపడ్డారు. పింక్ కలర్ వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.