వాట్సాప్ కు ఎలాన్ మస్క్ బిగ్ షాక్
NEWS Jun 12,2025 09:32 am
స్టార్ లింక్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ఎక్స్ యాప్ లో కొత్తగా ఎక్స్ చాట్ పేరుతో చాట్ ఇంటర్పేస్ ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించాడు. ఇది పూర్తిగా వాట్సాప్ కు పోటీగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ XChat ద్వారా ఫోన్ నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఈ వారం లోపే ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.. XChat ని X యూజర్ల కోసం రూపొందించారు. ఇది ఇప్పటికే ఉన్న X ప్లాట్‌ఫారమ్ డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.