టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పనిసరి
NEWS Jun 12,2025 08:55 am
కేంద్ర రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు ఝలక్ ఇచ్చింది. ఇక నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపింది. ఆధార్ అథెంటికేషన్ చేసిన యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోగలరని స్పష్టం చేసింది. జులై 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని ప్రకటించింది.